భారత్ నుంచి 6మిలియన్ దోమతెరల కొనుగోలు
ఇస్లామాబాద్: ఇటీవల వరదలు ముంచెత్తడంతో మలేరియా ప్రబలింది. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో 6మిలియన్ దోమతెరలను భారత్ నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపిందని మీడియా మంగళవారం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనుగోలుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించిందని టీవి నివేదించింది. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ త్వరగా దోమతెరలను సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వచ్చేనెలలో వాఘా మార్గంలో పాక్‌కు చేరుకుంటాయని కాగా వరదల ధాటికి ప్రాణాలు కోల్పోగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. జూన్ మధలో వర్షాల కారణంగా ముంచెత్తడంతో పాక్ భూభాగం నీటమునిగింది. ఈనేపథ్యంలో సెప్టెంబర్‌లో మలేరియా రూపంలో మరో విపత్తు పొంచిఉందని డబ్లూహెచ్‌ఓ 2023 జనవరి నాటికి ప్రభావిత మలేరియా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డబ్లూహెచ్‌ఒ తెలిపింది. దోమలవల్ల చిన్నపిల్లలు బారిన పడుతున్నారని అధికారులు తెలిపారు. మలేరియా తీవ్రంగా ఉన్న సింధ్, పంజాబ్, బలూచిస్థాన్‌లోని అందించేందుకు గ్లోబల్ ఫండ్ కోసం విన్నవించామని పాక్ అధికారులు తెలిపారు.