Friday, December 27, 2024

పాకిస్థాన్ కు అణు బాంబు నిర్వహణ కూడా కష్టమే: మోడీ

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: జూన్ 4 తర్వాత కాంగ్రెస్ కు ప్రతిపక్షానికి కావలసినంత సంఖ్యా బలం కూడా ఉండకుండా 50 స్థానాల కంటే తక్కువ బలమే ఉండగలదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒడిశాలోని కంధమల్ లోక్ సభ నియోజకవర్గంలో నిర్వహించన ర్యాలీలో ఆయన నేడు ప్రసంగించారు. ఎన్డిఏ 400కు పైగా సీట్లను గెలువబోతోందని, బిజెపి ఇదివరకటి తన రికార్డులను కూడా అధిగమించగలదని అన్నారు. ‘‘నా మాటను రికార్ఢుగా ఉంచుకోండి’’ అని మోడీ అన్నారు.

‘‘షెహజాదా రాహుల్ గాంధీ ప్రతి రోజు ఏదో ఓ ప్రకటన చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షానికి కావలసినంత సంఖ్యా బలం కూడా కాంగ్రెస్ కు ఇవ్వకూడదని దేశం నిర్ణయించుకున్నది. కాంగ్రెస్ కు 50 కంటే తక్కువ సీట్లే వస్తాయి. అది మీరు జూన్ 4న చూస్తారు’’ అని మోడీ తెలిపారు.

కాన్పూర్ ర్యాలీలో రాహుల్ గాంధీ ‘‘జూన్ 4 తర్వాత మోడీ ప్రధానిగా ఉండబోరు’’ అన్న మరునాడే మోడీ పై విధంగా అన్నారు. అటల్ బీహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ పొక్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ చేసింది. ప్రపంచంలోని భారతీయులంతా దీనికి గర్వించారు. పాకిస్థాన్ అణు శక్తికి కాంగ్రెస్ భయపడుతోంది. వారి మైండ్ సెట్ అలాంటిది. ‘‘నేడు పాకిస్థాన్ తన అణు బాంబును నిర్వహించడం కూడా కష్టమైపోయింది. దానిని వారిప్పుడు ఎవరికైనా అమ్మేయాలని అనుకుంటన్నారు. అయితే అది అంత నాణ్యమైనదేమి కాదని ప్రజలకు తెలుసు. అందుకే అది అమ్ముడవ్వడం లేదు’’  అని ప్రధాని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ విధానాల వల్లే జమ్మూకశ్మీర్ 60 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూ వస్తోందన్నారు. ఒడిశా ప్రభుత్వం పై కూడా ప్రధాని విమర్శలు గుప్పించారు. పూరీ జగన్నాథ్ మందిరం తాలూకు ‘రత్న భండార్’ తాళంచెవులు కనిపించకుండా పోయాయని అన్నారు. రత్న భండార్ లో ఉన్న ఆభరణాల రికార్డులను మెయిన్ టైన్ చేయాలని జగన్నాథ్ మందిర చట్టం చెబుతోందని మోడీ వివరించారు. రత్న భండార్ తాలూకు ఆభరణాల అధికారిక రికార్డులు లేవు. ఆ భండాగారం తాళంచెవులు పోయి ఆరు సంవత్సరాలు అవుతున్నాయి’’ అని మోడీ వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News