Saturday, November 2, 2024

ఇమ్రాన్‌కే బ్యాట్ పాకిస్థాన్ హైకోర్టు రూలింగ్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల దశలో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ)కి ఊరట దక్కింది. ఈ పార్టీ ఎన్నికల చిహ్నం క్రికెట్ బ్యాట్‌ను పెషావర్ హైకోర్టు పునరుద్ధరించింది. మునుపటి క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్‌కు క్రికెట్ బ్యాట్ ఎన్నికల చిహ్నం కావడం ప్రతీకాత్మకం అయింది. అయితే జైలులో ఉన్న ఈ మాజీ ప్రధాని ఇమ్రాన్ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని రద్దు చేసింది. పిటిఐ సకాలంలో పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయలేకపోయిందని, ఫిబ్రవరి 8 వ తేదీ నాటి పార్లమెంట్ ఎన్నికలలో ఈ చిహ్నాన్ని వాడుకోవడానికి వీల్లేదని ఆదేశించింది.

దీనికి వ్యతిరేకంగా పార్టీ వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఎన్నికల సంఘం నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం అని పేర్కొంటూ పెషావర్ కోర్టు ఈ బ్యాట్ చిహ్నాన్ని ఆ పార్టీకి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ ఎన్నికల సంఘం వెలువరించిన ఆదేశాలు ఏ విధంగా కూడా న్యాయసమ్మతం కాదని పెషావర్ హైకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ ఎల్‌జాజ్ అన్వర్ , జస్టిస్ అర్షద్ అలీ తమ తీర్పు వెలువరించారు. ఎన్నికల సంఘం రికార్డు పదిలం పనిచేయాల్సి ఉంటుంది తప్పితే పార్టీ ఎన్నికల చిహ్నం లాగేసే అధికారాలకు దిగే వీలులేదని పిటిఐ తరఫు న్యాయవాది అలీ జాఫర్ చేసిన వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News