Monday, January 20, 2025

జైలులోనే ఔటుకు కుట్రలు : ఇమ్రాన్

- Advertisement -
- Advertisement -

లాహోర్ : తనను స్లో పాయిజన్ ద్వారా అంతమొందించేందుకు మరోసారి కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. అవినీతి అభియోగాలతో ఇమ్రాన్ ఇప్పుడు రావల్పిండిలోని అడియాలా జైలులో నిర్బంధంలో ఉన్నారు. తనను దేశం వీడిపోవాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇందుకు తాను నిరాకరించడంతో జైలులోనే మట్టుపెట్టేందుకు యత్నిస్తున్నారని మాజీ క్రికెటర్ ఇమ్రాన్ శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెలువరించిన స్పందనను ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. తాను ఇప్పటికీ శారీరకంగా ధృఢంగానే ఉన్నానని, తనకు విషమిచ్చి చంపేందుకు రెండుసార్లు యత్నించారని తెలిపిన ఈ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చీఫ్ తనకు తాను ఎప్పటికప్పుడు అన్ని విషయాలను జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నానని వెల్లడించారు. బెయిల్ మంజూరీకి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చిన రోజే ఆయన స్పందన వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News