లాహోర్: ఆసియాకప్‌కు సంబంధించి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి జైషా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తీ వ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ గడ్డపై జరిగే ఆసియాకప్‌లో భారత్ ఆడే ప్రసక్తే లేదని జైషా ప్రకటించడం విడ్డూరంగా ఉందని పిసిబికి చెందిన అధికారి ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైషా ఏ హోదలో ఈ ప్రకటన చేశారో తమకు అంతుబట్టడం లేదన్నారు. ఆసియా కప్‌లో భారత్ పాల్గొనదని జైషా ప్రకటించడంపై పిసిబితో సహా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు చెందిన ఇతర దేశాల క్రికెట్ బోర్డులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆసియాకప్‌పై ప్రకటన చేసే హక్కు జైషాకు లేదని వారు స్పష్టం చేశారు. దీనిపై ఏదైన ప్రకటన చేసే అధికారం కేవలం ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు మాత్రమే ఉందని ఆయా బోర్డులు పేర్కొన్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో చర్చించిన తర్వాతే దీనిపై ప్రకటించాల్సి ఉంటుందనే విషయం జైషాకు తెలియక పోవడం బాధగా ఉందని వ్యాఖ్యానించాయి.
జైషాపై పిసిబి గుర్రు
- Advertisement -
- Advertisement -
- Advertisement -