Monday, January 20, 2025

భారత్ తో వాణిజ్య సంబంధాలు తెంచుకున్న పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పుల్వామ దాడుల తర్వాత దిగుమతులపై భారత్ అధిక పన్నులు విధించిన కారణంగా పాకిస్థాన్, భారత్ తో వాణిజ్య సంబంధాలను 2019 నుంచి సస్పెండ్ చేసుకుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డర్ అన్నారు. పాకిస్థాన్ కు ఉప ప్రధాని కూడా అయిన డర్ నేషనల్ అసెంబ్లీకి సమర్పించిన రాతపూర్వక సమాధానంలో ‘‘ పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల పైన భారత్ 200 శాతం పన్నులు విధించాలని నిర్ణయించుకుంది. పుల్వామా దాడుల తర్వాత కశ్మీర్ బస్ సర్వీస్ ను రద్దు చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి వాణిజ్యాన్ని కూడా రద్దు చేసుకుంది’’ అని తెలిపారు.

పాకిస్థాన్ ఎదుర్కొంటున్న వాణిజ్య సవాళ్లను..ముఖ్యంగా భారత్ తో వాణిజ్య సంబంధాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ శాసనసభ్యుడు షర్మిలా ఫారూఖీ అడిగిన ప్రశ్నకు డర్ జవాబిస్తూ అలా చెప్పారని ‘డాన్’ దినపత్రిక పేర్కొంది.

లండన్ లో మార్చిలో జరిగిన  ఓ విలేకరుల సమావేశంలో డర్ మాట్లాడుతూ భారత్ తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలన్న ఆత్రుతతో పాకిస్థాన్ ఉందన్నారు. అయితే ఆయన కార్యాలయం మాత్రం భారత్ తో వాణిజ్య సంబంధాలను పునురద్ధరించుకోవాలన్న ప్లాన్ పాకిస్థాన్ కు లేదని స్పష్టం చేసింది. పాక్, భారత వాణిజ్య సంబంధాలు 2019 నుంచి లేవు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News