Tuesday, September 17, 2024

రెండో టెస్టులోనూ పాక్ చిత్తు బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్

- Advertisement -
- Advertisement -

రావల్పిండి: పాకిస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్ 20తో క్లీన్ స్వీప్ చేసింది. ఆతిథ్య పాకిస్థాన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘోర పరాజయం చవిచూసింది. 185 పరుగుల లక్ష్యాన్ని బం గ్లాదేశ్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌కు ఇదే అతి పెద్ద విజయంగా చెప్పొచ్చు. నిరసనలు, అల్లర్లతో తమ దేశం అట్టుకుతున్న సమయంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శనతో జట్టుకు చారిత్రక విజయం సాధించి పెట్టారు. ఈ గెలుపు బంగ్లాదేశ్ క్రికెట్‌కు కొత్త దిశను చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 42/0 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు బ్యా టింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జాగ్రత్తగా ఆడు తూ లక్షం దిశగా అడుగులు వేసింది.

ఓపెనర్లు జకీర్ హసన్ (40), షాద్మాన్ ఇస్లామ్ (24)లు ఆరంభంలోనే పెవిలియన్ చేరారు. అయితే కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో, మోమినుల్ హక్ సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ జట్టును లక్షం దిశగా నడిపించారు. షాంటో 5 ఫోర్లతో 38 పరుగు లు చేశాడు. హక్ 4 బౌం డరీలతో 34 పరుగులు సాధించా డు. ఇక మిగిలిన లాంఛనాన్ని ముష్ఫికుర్ రహీం, షకిబ్ అల్ హ సన్ పూర్తి చేశారు. ఇద్దరు పాకిస్థా న్ బౌలర్లను దీటుగా ఎదుర్కొం టూ మరో వికెట్ కోల్పోకుండానే జట్టుకు విజయం సాధించి పెట్టా రు. రహీం (22), షకిబ్ (21) పరుగులతో అజేయంగా నిలిచా రు. ఇక పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274, రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. కాగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. వికెట్ కీపర్ లిటన్ దాస్ (138) అద్భుత సెంచరీతో జట్టును ఆ దుకున్నాడు.

మెహదీ హసన్ మీరాజ్ (78) తనవంతు పాత్ర పోషించాడు.దాస్‌కు మ్యా చ్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించగా, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా మీరాజ్ నిలిచాడు. తొలి టెస్టులో బంగ్లాదేశ్ పది వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. కాగా, బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయంగా చెప్పొచ్చు. సుదీర్ఘ కాలంగా టెస్టు క్రికెట్ ఆడుతున్న బంగ్లాదేశ్ ఎప్పుడూ కూడా ఇంత పెద్ద విజయం సాధించలేదు. తనకంటే ఎంతో బలంగా ఉన్న పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి బంగ్లాదేశ్ ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం సృష్టించింది. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుని బంగ్లాదేశ్ సాధించిన గెలుపుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News