Friday, December 20, 2024

పాక్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

హంబన్‌తోట: అఫ్గానిస్థాన్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ 142 పరుగు ల భారీ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యా టింగ్ చేసిన పాకిస్థాన్ 47.1 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (61), ఇఫ్తికార్ (30), షాదాబ్ ఖా న్ (39) మాత్రమే రాణించారు. తర్వాత బ్యా టింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 59 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైంది. ఓపెనర్ గుర్బాజ్(18), అజ్మతుల్లా(16) మాత్రమే రె ండంకెల స్కోరును అందుకున్నారు. పాక్ బౌ లర్లలో హారిస్ రవూఫ్ ఐదు వికెట్లు తీశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News