- Advertisement -
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోమారు వక్రబుద్ధిని చాటుకుంది. వరుస భూకంపాలతో అతలాకుతలమైన టర్కీకి సహాయక సామగ్రితో బయలుదేరిన భారత విమానానికి ఎయిర్‌స్పేస్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
దీంతో భారత విమానం మరో మార్గం ద్వారా టర్కీలోని అదానా సకిర్పాసా విమానాశ్రయంలో దిగింది. భారత విమానానికి తమ ఎయిర్‌స్పేస్ నిరాకరించడం పాకిస్థాన్‌కు ఇదేమీ కొత్తకాదు. గతంలో ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్ మానవతా సాయం కింద 50 వేల టన్నుల గోధుమలను పంపిస్తున్నప్పుడు కూడా పాకిస్థాన్ ఇలాగే తమ ఎయిర్‌స్పేస్ వాడుకునేందుకు నిరాకరించింది.
- Advertisement -