ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్‌లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్వాత్‌వ్యాలీలో భవనాలు కూలిపోవడంతో 12 మంది దుర్మరణం చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్థాన్, అఫ్గానిస్తాన్‌లో రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూమి కంపించిందని భూ పరిశోధన అధికారులు వెల్లడించారు. ఈ భూప్రకంపనలు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌ను తాకాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాకిస్తాన్‌లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. పోలీసులు, ఆర్మీ బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
Yun koi apne rab se itna bewabasta ho sakta toh rab k jaat ne bhi dikha diya mai ek #زلزله se tujhe apni taraf jhuka Sakta hoon turant tumhari gano ki mahfil ko wazifo ki mahfil me tabdil kar Sakta hoon #PakistanEarthquake #delhiearthquake #زلزله pic.twitter.com/NBfFuCNWSy
— Shaikh Zeeshan (@ShaikhZ92763679) March 22, 2023