Monday, January 20, 2025

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి కాలేదు. ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాలు కన్పిస్తున్నాయి. పిటిఐ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక సీట్లు సొంతం చేసుకున్నారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉన్నాయి. 336 సీట్లలో నేరుగా 266 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మిగితా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయించారు. పాకిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటుకు 133 సీట్లు కావాల్సిఉంది. సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ముందుకు రావాలంటూ విపక్షాలకు షరీఫ్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News