Sunday, December 22, 2024

ఫైనల్లో పాకిస్థాన్…. భారత్ ఇంటికి

- Advertisement -
- Advertisement -

షార్జా : ఆసియాకప్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్ ఒక వికెట్ తేడా తో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో పాక్ తలపడుతోంది. ఇక భారత్, అఫ్గాన్‌లు టోర్నీ నుంచి వైదొలిగాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో అఫ్గాన్ పోరాడి ఓడింది. నసీమ్ షా వరుసగా రెండు బంతుల్లో 2 సిక్సర్లు కొట్టి పాక్‌కు సంచలన విజయం సాధించి పెట్టాడు. ఇక అప్పటి వరకు అఫ్గాన్ విజయం ఖాయమని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక ఇఫ్తికార్ (30), షాదాబ్ (36), ఆసిఫ్ (16), రిజ్వాన్ (20) పాక్ విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టులో ఇబ్రాహీం జర్దాన్ (35) ఒక్కడే కాస్త రాణించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News