Thursday, December 19, 2024

పాక్ విదేశాంగ మాజీ మంత్రి ఖురేషీ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి , తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఉపాధ్యక్షుడు షా మహమూద్ ఖురేషీ ( 67) అరెస్ట్ అయ్యారు. ఇస్లామాబాద్ లోని ఆయన నివాసంలో ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఎ) అధికారులు ఆయనను శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అమెరికా లోని పాక్ కార్యాలయ రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారన్న అభియోగంతో అధికారిక రహస్యాల చట్టం కింద ఖురేషీని అరెస్టు చేసినట్టు సమాచారం. ఆదివారం ఖురేషీని సెషన్స్ కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఒక రోజు రిమాండ్ కోర్టు విధించింది. సోమవారం ఆయనను కోర్టుకు హాజరు పర్చాలని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎహితిషామ్ ఆలంఖాన్ ఆదేశించారు. తానెలాంటి రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయలేదని, ఇదంతా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఖురేషీ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News