- Advertisement -
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు బయట అరెస్టయ్యారు. పాకిస్థాన్ మీడియా ఈ విషయాన్ని తెలిపింది. అవినీతి కేసులో తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్(పిటిఐ) పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు ఆవరణలో కస్టడీలోకి తీసుకున్నారని సమాచారం. అరెస్టు విషయాన్ని చెప్పకుండానే ఇమ్రాన్ ఖాన్‌ను చుట్టుముట్టారని ఆయన సహచరుడు ఫవాద్ చౌదరి తెలిపారు. కానీ రాయిటర్ ప్రశ్నించినప్పుడు మరియం ఔరంగజేబ్ స్పందించలేదని సమాచారం. పిటిఐకి చెందిన మరో నాయకుడు అజహర్ మష్వానీ 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌ను రేంజర్లు కోర్టులోపలే ఎత్తుకుపోయారని అన్నారు. దేశంలో నిరసనకు పార్టీ వెంటనే పిలుపునిచ్చినట్లు కూడా ఆయన తెలిపారు. ‘రేంజర్లు ఇమ్రాన్ ఖాన్‌ను చిత్రవధ చేస్తున్నారు…ఆయనని కొడుతున్నారు. వారు ఆయనపై ప్రతాపం చూపుతున్నారు’ అని వీడియో సందేశంలో చీమా తెలిపారు.
- Advertisement -