Monday, December 23, 2024

ఇమ్రాన్ ఖాన్ @71

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని అంతకు ముందు ప్రఖ్యాత క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ 71వ జన్మదినం గురువారం జరిగింది. దేశ రహస్య చట్టాల ఉల్లంఘనల కేసులో ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లనడుమ రావల్పిండి జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ పిటిఐ పార్టీ తరఫున కొన్నిచోట్ల సాదాసీదాగా కార్యక్రమాలు చేపట్టారు. అయితే లాహోర్‌లోని లిబర్టీ చౌక్‌లో మద్దతుదార్లు ప్రత్యేకించి యువత తమ హీరో ఇమ్రాన్ అని పేర్కొంటూ పాటలతో పార్టీలు జరిపారు. పాకిస్థాన్ క్రికెట్ కంట్రోలు బోర్డు ఇమ్రాన్ ఖాన్ క్రికెటర్‌గా సాధించిన విజయాల చిత్రాలను సామాజిక మాధ్యమంలో ఉంచింది.

గూగుల్ నుంచి ఇమ్రాన్ ఖాన్ బర్త్‌డే సందర్భంగా ప్రత్యేక సంకేతపు డూడుల్‌ను పొందుపర్చారు. 3807 రన్స్, 362 వికెట్స్ అంటూ క్రికెట్ బోర్డు కొనియాడింది. ఇక కేవలం క్రికెట్‌ను తన లోగోగా పేర్కొంటూ ఇమ్రాన్‌ఖాన్ బర్త్‌డేను గూగుల్ అందరికీ తెలియచేసింది. కాగా తనపై తోషాఖానా కేసులో ట్రయల్ కోర్టు శిక్షను పూర్తిగా ఎత్తివేయాలని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News