Friday, November 15, 2024

అంతర్జాతీయ క్రికెట్‌కు వహాబ్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

లాహోర్: పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని రియాజ్ బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. పాకిస్థాన్‌కు లభించిన అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో రియాజ్ ఒకడిగా పేరు తెచ్చకున్నాడు. సుదీర్ఘ కాలం పాటు పాకిస్థాన్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించిన వహాబ్ కెరీర్‌లో 237 వికెట్లు పడగొట్టాడు. అంతేగాక మూడు వన్డే ప్రపంచకప్‌లలో కూడా ఆడాడు.

Also Read: లవ్ జిహాద్ పేరిట దారుణం: ముంబైలో ముస్లిం యువకుడిపై దాడి(వైరల్ వీడియో)

2011, 2015, 2019 ప్రపంచకప్‌లలో వహాబ్ పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక కెరీర్‌లో 27 టెస్టులు, 91 వన్డేలు, మరో 36 టి20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా, 2008, ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో వహాబ్ అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. ఇక చివరి అంతర్జాతీయ మ్యాచ్ డిసెంబర్ 2020లో ఆడాడు. కొంతకాలంగా వహాబ్‌కు పాకిస్థాన్ జట్టులో చోటు లభించడం లేదు. దీంతో చాలా రోజుల పాటు వేచి చూడిన వహాబ్ చివరికి రిటైర్మెంట్ ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ఈ విషయాన్ని వహాబ్ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News