Thursday, December 26, 2024

మోడీ అంటే పాక్‌కు బెదురు:అమిత్ షా

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్‌లో సరిహద్దులు పొడుగునా ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం చెప్పారు. పాకిస్తాన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ అంటే బెదురు అని, ఆయన కాల్పులు జరిపిస్తారని పొరుగు దేశానికి భయం అని హోమ్ శాఖ మంత్రి అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని పూంఛ్ జిల్లాలో ఈ సరిహద్దు ప్రాంతంలో బిజెపి అభ్యర్థి ముర్తజా ఖాన్‌కు మద్దతుగా ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారు. యువజనుల చేతులకు తుపాకులు, రాళ్ల స్థానంలో ల్యాప్‌టాప్‌లు అందజేయడం ద్వారా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టినందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్రాన్ని ఆయన అభినందించారు.

జమ్మూ ప్రాంతంలోని పర్వతాల్లో తుపాకుల శబ్దాన్ని తమ ప్రభుత్వం ప్రతిధ్వనించనివ్వదని మంత్రి చెప్పారు. ‘ప్రజల భద్రత కోసం సరిహద్దుల్లో మరిన్ని బంకర్లు నిర్మిస్తాం. 1990 దశకం నాటి సీమాంతర కాల్పుల గురించి మీకు గుర్తు చేయదలిచాను& ఇప్పుడు సీమాంతర కాల్పులు జరుగుతున్నాయా? పూర్వపు పాలకులు పాకిస్తాన్ అంటే భయపడినందున అవి జరిగాయి. కానీ ఇప్పుడు మోడీని చూసి పాకిస్తాన్ భయపడుతోంది. వారు కాల్పులకు ధైర్యం చేయలేరు, ఒక వేళ వారు ఆ పని చేస్తే వారికి గట్టి సమాధానం ఇవ్వగలం’ అని అమిత్ షా చెప్పారు. బిజెపి నేత అమిత్ షా జెకెలో మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఆయన పూంఛ్‌లో సురార్‌కోట్‌లోను, రాజౌరి జిల్లాలో తనమండి, రాజౌరిలోను, జమ్మూ జిల్లాలో అఖ్నూర్‌లోను మరి నాలుగు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించవలసి ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News