Wednesday, January 22, 2025

వాయవ్య పాకిస్థాన్‌లో ఆగని ఉగ్రదాడులు

- Advertisement -
- Advertisement -

పెషావర్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత కైబర్ ఫక్తూన్‌క్వా ప్రాంతంలో మిలిటెంట్లు శుక్రవారం భీకరదాడులకు దిగారు. ఈ ఘటనల్లో కనీసం ఐదుగురు భద్రతాధికారులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇటీవలే మూడురోజుల క్రితం ఉగ్రవాదులు జరిపిన దాడులలో 23 మంది సైనికులు హతులు అయ్యారు. ఇప్పుడు టాంక్ జిల్లాలోని పోలీసు లైన్స్ ప్రాంతంలో వరుసగా దాడులు జరిగాయి. ఓ పోలీసు చెక్‌పోస్టు వద్ద ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు.

పోలీసు బలగాలకు , ఉగ్రవాదులకు నడుమ జరిగిన కాల్పుల్లో నలుగురు సాయుధులు కూడా చనిపోయినట్లు స్థానిక అధికార యంత్రాంగం తెలిపింది. నిషేధిత తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) అనుబంధ సంస్థలు పలు పేర్లతో ఈ వాయవ్య పాకిస్థాన్ ప్రాంతంలో ఇటీవల సంచలనాత్మక దాడులకు దిగుతోంది. ఎక్కువగా శుక్రవారం మధ్యాహ్న సమయాలను ఎంచుకుని దాడులకు పాల్పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News