Monday, January 20, 2025

పాక్ పంజాబ్‌లో తొలి సిక్కు మంత్రి

- Advertisement -
- Advertisement -

ప్రముఖ మైనారిటీ నేత సర్దార్ రమేష్ సింగ్ అరోరా

లాహోర్ : పాకిస్తాన్‌లో పలుకుబడి గల మైనారిటీ నేత సర్దార్ రమేష్ సింగ్ అరోరా ప్రొవిన్షియల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 49 ఏళ్ల అరోరా దేశ విభజన అనంతరం పంజాబ్‌లో మంత్రి పదవి పొందిన తొలి సిక్కు అయ్యారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్‌ఎన)కు చెందిన అరోరా ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికలలో లాహోర్ ప్రొవిన్షియల్ అసెంబ్లీకి తిరిగి ఎన్నికయ్యారు.

ఆయనకు అసెంబ్లీకి ఎన్నికవడం మూడవ సారి. అరోరా మరి 17 మందితో కలసి బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి మరియం నవాజ్ మంత్రివర్గంలో పంజాబ్ ప్రావిన్స్ మైనారిటీ వ్యవహారాల శాఖను అరోరాకు కేటాయించారు. అరోరా ఇటీవల పాకిస్తాన్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన్ (అధ్యక్షుడు)గా ఎన్నికయ్యారు. ఆయన కర్తార్‌పూర్ కారిడార్‌కు రాయబారి కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News