- Advertisement -
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చైనా నుంచి మరిన్ని కొత్త ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు అందుతున్నాయి. చైనా నార్త్ ఇండస్ట్రీ గ్రూప్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 250 155ఎంఎం 52 క్యాలిబర్ ట్రక్ మౌంటెడ్ గన్స్‌ను కొనాలని పాకిస్థాన్ చూస్తోంది. ఈ ఆయుధాల కొనుగోలు షరతులు కూడా చాలా ఔదార్యంగా ఉన్నాయని తెలుస్తోంది. వెలాసిటీ రాడార్లు, టెక్నాలజీ బదలాయింపు, సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియోలు వగైరా చైనా నుంచి పాకిస్థాన్‌కు అందనున్నాయి.
ఆ రెండు దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఒప్పందంపై సంతకం కాగానే రెండేళ్లలో తొలి 54 గన్స్ డెలివరి అవుతాయి.మరో 54 గన్స్ మూడేళ్లకు, 70 నాలుగవ ఏడాది, 72 గన్స్ ఐదవ ఏడాది అందుతాయి.
- Advertisement -