Sunday, December 22, 2024

ఇమ్రాన్ పార్టీపై నిషేధం ?

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ( పిటీఐ ) ఘర్షని నిషేధించే యోచనలో పాక్ ప్రభుత్వం ఉంటోంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తరువాత దేశం లోని ఘర్షణలకు ఆ పార్టీయే కారణమని, ఆ పార్టీ మద్దతుదారులు అనేక దాడులకు పాల్పడ్డారని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలపై మే 9న ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు.

ఆ తరువాత ఆ పార్టీ పిటిఐ మద్దతుదారులు ఆర్మీ, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. కొన్నిటికి నిప్పు అంటించారు. ఇన్ని జరిగినా ఖండించడానికి ఇమ్రాన్ ఖాన్ అంగీకరించడం లేదని ఖవాజా వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ పార్టీ నిషేధంపై ఇంకా నిర్ణయం కాలేదని, సమీక్ష జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం చివరకు నిషేధించడానికి నిర్ణయిస్తే పార్లమెంట్ అనుమతి కోసం ఈ నిర్ణయాన్ని పంపడమౌతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News