Monday, December 23, 2024

పాక్‌లో కరెంట్ కటకట

- Advertisement -
- Advertisement -

Pakistan Govt warns of mobile internet services

ఇంటర్నెట్ సేవలకూ విఘాతం
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం

ఇస్లామాబాద్ : ఆర్థిక సంక్షోభానికి తోడు పాకిస్థాన్‌ను విద్యుత్ కష్టాలు వెన్నాడుతున్నాయి. దీంతో కరెంట్ కోతలు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. టెలికామ్ ఆపరేటర్లు మూకుమ్మడిగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని గురువారం అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు.. నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గంటల తరబడి కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. అంతరాయం టెలికాం ఆపరేటర్ల కార్యకలాపాలకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. అందుకే టెలికామ్ ఆపరేటర్లు మొబైల్, ఇంటర్నెట్ సేవలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు అని ఎన్‌ఐబిటి ప్రకటించింది.

పాక్ దేశ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో విద్యుత్ కోతలు ఎదుర్కొవడం ఇదే ప్రథమం. ఇక విద్యుత్‌సంక్షోభం మునుముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రధాని షెహబాబ్ షరీఫ్ ముందస్తు ప్రకటనలు చేయడం గమనార్హం. ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) సరఫరా ఇబ్బందికరంగా మారిందని, అయితే ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. మరోవైపు మునుపెన్నడూ లేని విధంగా జూన్ నెలలో నాలుగు ఏళ్ల తర్వాత అధికంగా చమురు ఇంధనాలను పాక్ దిగుమతి చేసుకుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సహజవాయువు విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News