అబుదాబి: ట్వంటీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో పాకిస్థాన్ గ్రూప్2 నుంచి సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. మంగళవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌లు అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రిజ్వాన్ 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ ఏడు ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 113 పరుగులు జోడించారు. హఫీజ్ ఐదు ఫోర్లతో వేగంగా 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.