Thursday, February 20, 2025

మా జట్టుకు అంత సీన్ లేదు: పాక్ మాజీ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19వ తేదీన పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ తమకు తాము హాట్ ఫేవరేట్‌గా భావిస్తుంటే.. అక్మల్ మాత్రం తనకు నమ్మకం లేదు అని అంటున్నారు.

‘‘1996 తర్వాత పాకిస్థాన్‌కు ఓ ఐసిసి టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చింది. ఇది దేశం మొత్తం గర్వపడే అద్భుతమైన క్షణం. ఇది విజయవంతంగా నిర్వహిస్తే.. భవిష్యత్తులో మరిన్ని ఐసిసి టోర్నమెంట్‌లు నిర్వహించే అవకాశం లభిస్తుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీని ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం. పాకిస్థాన్‌కు మాత్రం అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయి. స్పిన్నర్లు, బ్యాట్స్‌మెన్ విభాగాల్లో లోపాలు ఉన్నాయి. జట్టును మరింత పటిష్టంగా ఎంపిక చేయాల్సింది. నాకు తెలిసి భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సెమీస్‌కు వస్తాయి. ఒకవేళ పాకిస్థాన్ వస్తే.. అదే గ్రేట్ అచీవ్‌‌మెంట్’’ అని అక్మల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News