Monday, January 20, 2025

ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

- Advertisement -
- Advertisement -

Mumabi attack

లాహోర్(పాకిస్థాన్): ముంబై 26/11 ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్‌కు పాకిస్థాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2008 ముంబై దాడుల ప్రధాన నిర్వాహకుడు అయిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) కార్యకర్త సాజిద్ మజీద్ మీర్‌కు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో పాకిస్థాన్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పంజాబ్ పోలీస్‌కి చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేసిన ఈ కేసులో జైలులో జరుగుతున్న ఇన్-కెమెరా ప్రొసీడింగ్ కావడంతో మీడియాను అనుమతించలేదు. 40 ఏళ్ల మధ్యలో ఉన్న దోషి మీర్ ఈ ఏప్రిల్‌లో అరెస్ట్ అయినప్పటి నుంచి కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నారని న్యాయవాది తెలిపారు.

పాకిస్తాన్ యొక్క సంబంధిత మనీలాండరింగ్ నిరోధక, తీవ్రవాద-ఫైనాన్సింగ్ సంస్కరణల అమలును ధృవీకరించడానికి గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్‌డాగ్ ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ (FATF)  సిద్ధమవుతున్ననేపథ్యంలో పాకిస్తాన్ కోర్టు అతనికి శిక్ష విధించింది. గత వారం, పారిస్‌కు చెందిన FATF, పెరిగిన పర్యవేక్షణలో ఉన్న దేశాలలో పాకిస్తాన్ “గ్రే లిస్ట్”లో కొనసాగుతుందని శుక్రవారం ఒక ప్రకటన తెలిపింది. టెర్రర్-ఫైనాన్సింగ్ మెకానిజమ్‌లను ఎదుర్కోవడంలో దాని సంస్కరణల అమలును ధృవీకరించడానికి ఆన్-సైట్ పర్యటన తర్వాత పాకిస్తాన్‌ను ఆ జాబితా నుండి తొలగించవచ్చని పేర్కొంది.

కోర్టు దోషికి రూ. 4,00,000 జరిమానా కూడా విధించిందని న్యాయవాది చెప్పారు.166 మందిని పొట్టనబెట్టుకున్న 26/11 ముంబై దాడుల్లో సాజిద్ మీర్ భారతదేశపు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మీర్‌ను ముంబై దాడులకు ప్రాజెక్ట్ మేనేజర్ అని పిలిచేవారు. మీర్ 2005వ సంవత్సరంలో మారు పేరుతో నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి భారతదేశాన్ని సందర్శించినట్లు సమాచారం.

మరోవైపు ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్ ఏటీసీ ఇప్పటికే ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో 68 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ముంబయి దాడి ఆపరేషన్‌ కమాండర్‌ జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీ కూడా కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సయీద్, మాకీ ఇద్దరూ లాహోర్‌లోని కోట్ లప్‌ఖాప్ట్ జైలులో ఉన్నారు.

Sajid Mir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News