Wednesday, January 22, 2025

కష్టాల్లో పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో, చివరి టెస్టులో పాకిస్థాన్ కష్టాల్లో చిక్కుకుంది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఇప్పటి వరకు పాక్‌కు కేవలం 82 పరుగుల ఆధిక్యం మాత్రమే దక్కింది. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ (0), కెప్టెన్ షాన్ మసూద్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ అయూబ్ (33), బాబర్ ఆజమ్ (23) రెండంకెల స్కోరును అందుకున్నారు. సౌద్ షకిల్ (2), సాజిద్ ఖాన్ (0), ఆఘా సల్మాన్ (0) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు తీశాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 299, పాకిస్థాన్ 313 పరుగులు చేశాయి. సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్ టీమ్ ఇప్పటికే 20 ఆధిక్యంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News