Thursday, April 17, 2025

మళ్లీ ఓడిన పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -
  • కివీస్‌తో తొలి టి20..
  • 9 వికెట్ల తేడాతో పరాజయం

క్రైస్ట్‌చర్చ్: ఇటీవలె ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర ఓటములతో గ్రూప్ దశలోనే ఇంటిదారిపట్టిన పాకిస్థాన్ ఆటలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టి20లో సైతం ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఘోర ఓటమిని దృష్టిని పెట్టుకుని పాక్ క్రికెట్ బోర్డు కివీస్ టూర్ కోసం జట్టులో మార్పులు చేసింది. కెప్టెన్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ లాంటి ఆటగాళ్లను పక్కన పెట్టింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాంటింగ్ చేసిన పాక్ 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ గడ్డపై పాక్ కు ఇదే అత్యల్ప టీ20 స్కోర్. ఖుష్దిల్ షా 32(30), అఘా సల్మాన్ 18(20) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 4, కైల్ జామిసన్ మూడు వికెట్లు తీశాడు. ఆ తరువాత 92 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ జట్టు 10.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది. టిమ్ సీఫెర్ట్ 44(29),ఫిన్ అలెన్ 29(17) పరుగులు చేసి జట్టును గెలిపించారు. దీంతో 9 వికెట్లతో విజయం సాధించి సిరీస్‌లో 10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News