Thursday, January 23, 2025

ప్రియుడి కోసం వచ్చి ఇరుక్కుపోయిన పాకిస్తాన్ ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

లక్నో: పాకిస్థాన్ ప్రియురాలు ఇండియాకు రావడంతో ప్రియుడితో సహా ఆమెను అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సచిన్ అనే వ్యక్తి కిరాణం జనరల్ స్టోర్‌లో పని చేసేవాడు. 2020లో సచిన్ ఆన్ లైన్‌లో పబ్జీ గేమ్ ఆడుతుండగా పాకిస్తాన్‌కు చెందిన హైదర్ పరిచయమైంది. ఫోన్‌లో పలుమార్లు మాట్లాడుకున్నారు. వీడియో కాల్ కూడా చేసుకున్నారు దీంతో ఇద్దరు గాఢంగా ప్రేమించుకోవడంతో హైదర్ ఇండియాకు రావాలని నిర్ణయం తీసుకుంది. హైదర్ అప్పటికే తన భర్త విడాకులు ఇవ్వడంతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. హైదర్ భారత్ వచ్చేందుకు సులభ మార్గం గురించి ఆన్‌లైన్‌లో వెతికారు.

Also Read: గోనె సంచిలో మహిళా మృతదేహం…

నేపాల్ నుంచి సులభమైన మార్గం ఉందని తెలుసుకున్నారు. వెంటనే పాక్‌లో విమానం ఎక్కి నేపాల్ దిగిపోయింది. నేపాల్‌లోని పొఖారా నుంచి తన పిల్లలతో సహా తల్లి ఇండియాలోని ఢిల్లీలోకి ప్రవేశించింది. మే 13న ఢిల్లీలోని నుంచి యమునా ఎక్స్‌ప్రెస్‌వేలోని రబుపూరా చేరుకున్నారు. వారు పెళ్లి చేసుకోవాలని న్యాయవాదిని కలవడంతో ఈ వ్యవహారం బయటపడింది. బస్సులో బలబ్‌గఢ్‌కు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రేమ పెళ్లి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను ప్రేమ జంట కోరింది.  తాము నేరము చేయలేదని, ప్రేమించుకున్నామన్నారు. ఇప్పటి వరకు తప్పు చేయలేదని హైదర్ తెలిపింది. సచిన్ కోసం చావడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది. సచిన్ గాఢంగా ప్రేమిస్తున్నాని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పాకిస్థాన్‌కు వెళ్లనని తెగేసి చెప్పింది. ప్రస్తుతం పాక్‌లో తనకు బంధువులు లేరని చెప్పింది. పోలీసులు మాత్రం ప్రియుడు, ప్రియురాలు, ప్రియుడి తండ్రిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News