Thursday, February 20, 2025

టీమిండియా జెర్సీలపై పాక్ పేరు

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఛాంఫియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడనుంది. కొత్త జెర్సీల్లో భారత ఆటగాళ్లు కనువిందు చేశారు. బిసిసిఐ తన ఎక్స్ ఖాతాలో టీమిండియా ఆటగాళ్లు ధరించిన జెర్సీలు పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. టీమిండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉంది. పాకిస్థాన్ పేరు తొలగించాలని భారత క్రికెట్ అభిమానులు డిమాండ్ చేయడంతో బిసిసిఐ స్పష్టత ఇచ్చింది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదేశాలకు మేరకు అన్ని దేశాల బోర్డులు పని చేయాల్సి ఉంటుందని వివరణ ఇచ్చింది. పాకిస్థాన్‌లో చాంఫియన్ ట్రోఫీ నిర్వహిస్తుండడంతో ట్రోఫీకి సంబంధించిన లోగోపై పాకిస్థాన్ పేరు ఉంటుందని బిసిసిఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. ఐసిసి ఆదేశాలను ఉల్లంఘించాలని తాము అనుకోవడం లేదన్నారు. పేరు తొలగించాలని తాము డిమాండ్ కూడా చేయలేదని సైకియా స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News