Thursday, December 19, 2024

మసీదులో బాలుడిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: రంజాన్ పండుగ నేపథ్యంలో మసీదులో ఇస్లామిక్ నేర్చుకుంటున్న బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన పాకిస్తాన్ దేశంలోని ముజఫర్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సనవాన్ బుఖీ చౌక్ ప్రాంతంలో రంజాన్ పండుగ సందర్భంగా మసీద్‌లో ఓ బాలుడు ఖురాన్‌ను అభ్యసిస్తున్నాడు. బాలుడికి ఓ వ్యక్తి మాయ మాటలు చెప్పి బలవంతంగా చిన్నోడిపై అత్యాచారం చేశాడు. వెంటనే సదరు వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. మసీదులోని ఇమామ్ వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఇమామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్ బాలల హక్కల కమిషన్ తన ఫేస్‌బుక్ పేజీలో స్పందించింది. పోలీసులు నిందితుడి అదుపులోిక తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News