Friday, April 25, 2025

ఆ ఇద్దరూ పాక్ జాతీయులే

- Advertisement -
- Advertisement -

పహల్గామ్ ఉగ్రవాదుల గుర్తింపు
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడులలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురిలో ఇద్దరు పాకిస్థానీ జాతీయులు అని భద్రతా బలగాలు ప్రాధమికంగా గుర్తించాయి. ఉగ్రవాదుల నమూనా రూపాలను తెలిపే స్కెచ్‌లను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఒక్కరోజు క్రితమే విడుదల చేశాయి. ఆచూకిని తెలిపే సమాచారం అందించిన వారికి రూ 20 లక్షల రివార్డును ప్రకటించారు. పహల్గామ్ దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులే కీలక పాత్ర పోషించారని పసికట్టారు. ఈ ఇద్దరు ఉగ్రవాదుల గుర్తింపు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరిలో ఒక్కరు హషీం మూసా అలియాస్ సులేమాన్ మరొక్కడు అలీ భట్ అలియాస్ తహా భట్ అని అధికారులు తెలిపారు. ఇక మూడో టెర్రరిస్టు జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన అబ్దుల్ హుస్సేన్ థోకర్ అని గుర్తించారు. ఈ వ్యక్తి భారతీయ పౌరుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News