Monday, January 20, 2025

పాక్ నేవీ హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌కు చెందిన నేవీ హెలికాప్టర్ కూలిపోయి అందులో ఉన్న ముగ్గురు సిబ్బంది మృతి చెందారు. పాక్‌లో తిరుగుబాటు ప్రాంతమైన బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఓడరేవు నగరమైన గ్వాదర్‌లో టేకాఫ్ అయిన నేవీ శిక్షణ హెలికాప్టర్ కూలిపోయింది. ఇందులో ఉన్న ఇద్దరు నేవీ అధికారులు, సిబ్బంది ఒకరు చనిపోయారని పాక్ నేవీ ప్రతినిధి తెలిపారు. హెలికాప్టర్ కూలిపోవడానికి ముందు ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News