Monday, December 23, 2024

అక్కడ ఆడేందుకు భయమెందుకు?

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : భారత్ వేదికగా జరిగే ప్రపంచ కప్‌లో అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఆడే ందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెనకంజ వేస్తుండడంపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశా డు. అహ్మదాబాద్‌లో ఆడితే ఉండే ఇబ్బందేమో తనకు అంతుబట్టడం లేదన్నాడు. ప్రపంచంలోనే అహ్మదాబాద్ స్టేడియం అతి పెద్దదని, ఇటీవలే అక్కడ ఐపిఎల్ మ్యాచ్‌లు విజయవంతంగా ముగిసిన విషయాన్ని అఫ్రిది గుర్తు చేశాడు. అహ్మదాబాద్ పిచ్‌లు కూడా క్రికెట్ మ్యాచ్‌లకు అనుకూలంగా ఉన్నాయన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లకు ఈ పిచ్ సమంగా సహకరిస్తుందన్నాడు.

Also read: విష్ణు ప్రియతో ప్రేమపెళ్లిపై స్పందించిన జెడి చక్రవర్తి

ఇలాంటి స్థితిలో పిచ్‌పై ఆందోళనతో అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఆడేందుకు పిసిబి వెనుకంజ వేయ డం సరికాదన్నాడు. అక్కడి పిచ్ బాగానే ఉందని, మ్యాచ్ సాఫీగా సాగడం ఖాయమన్నాడు. అయినా పాక్ బోర్డు ఇలాంటి లేని పోని అనుమానాలతో ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయం సరికాదన్నాడు. ఇదిలావుంటే వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 15న భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఆడే విషయంలో పాక్ బోర్డు ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News