Tuesday, November 5, 2024

పాకిస్థాన్ “అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి: బైడెన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  చేసిన అత్యంత నిష్కపటమైన ప్రకటనలో పాకిస్థాన్‌ను ప్రపంచంలోనే “అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి”గా అభివర్ణించారు. లాస్ ఏంజిల్స్ (కాలిఫోర్నియా)లో జరిగిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్‌లో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు, ఈ సందర్భంగా ఆయన చైనా , రష్యాలను దూషించారు. చైనా,  రష్యాకు సంబంధించి అమెరికా విదేశాంగ విధానం గురించి బైడెన్‌ మాట్లాడుతూ పాకిస్థాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా తాను భావిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. బైడెన్ వ్యాఖ్యలు అమెరికాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఎదురుదెబ్బగా భావించవచ్చు. కాంగ్రెస్ తప్పనిసరి చేసిన కీలక విధాన పత్రాన్ని బైడెన్ అడ్మినిస్ట్రేషన్  బుధవారం విడుదల చేసింది, ఇది చైనా, రష్యా రెండింటి నుండి అమెరికాకు ఎదురయ్యే ముప్పును నొక్కి చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News