Sunday, December 22, 2024

సూపర్-8కు అమెరికా.. టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ ఔట్

- Advertisement -
- Advertisement -

టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్‌ జట్టు నిష్క్రమించింది. నిన్న జరగాల్సిన అమెరికా, ఐర్లాండ్‌ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. అనంతరం ఇరుజట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.దీంతో ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన అమెరికా జట్టు ఐదు పాయింట్లు సాధించి సూపర్-8కు అర్హత సాధించింది. దీంతో పాకిస్థాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.

పాక్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లో ఒకటి మాత్రమే గెలిచింది. దీంతో పాక్ జట్టు.. ఈ సారి సూపర్ 8కు కూడా చేరకుండా ఇంటిదారి పట్టనుంది. మగిలిన మ్యాచ్ ఈ నెల 16న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇందులో గెలిచినా పాకిస్థాన్ కు ఏం లాభం లేదు. దీంతో పాకిస్థాన్ జట్టుపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News