Wednesday, April 2, 2025

ఈ ఏడాది 30 లక్షల మంది ఆఫ్ఘన్లను బహిష్కరించనున్న పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది తమ దేశం నుంచి దాదాపు 30 లక్షల మంది ఆఫ్ఘన్లను బహిష్కరించే ప్రణాళికను పాకిస్థాన్ రచిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ రాజధాని, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపొమ్మని గడువు కూడా పెట్టింది. పాకిస్థాన్‌లో అక్రమంగా నిసిస్తున్న ఆఫ్ఘన్లపై పాకిస్థాన్ ఇప్పటికే చర్యలు మొదలెట్టింది. దీనిపై తాలిబాన్ ప్రభుత్వం, రైట్ గ్రూప్‌లు మండిపడుతున్నాయి. ఈదుల్ ఫితర్ పండుగ కారణంగా అరెస్టులు, డిపోర్టేషన్స్ డ్రైవ్‌ను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10కి వాయిదా వేసుకుంది. గత 18 నెలల్లో 8,45,000 మంది ఆఫ్ఘన్లు పాకిస్థాన్ నుంచి వెళ్లపోయారని ప్రవాసుల అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. తమ దేశంలో 30 లక్షల మంది ఆఫ్ఘన్లు ఉన్నారని,

వారిలో 13,44,584 మందికి ధ్రువీకరణ రిజిస్ట్రేషన్ కార్డులు ఉన్నాయని, కాగా 8,07,402 మందికి ఆఫ్ఘన్ సిటిజెన్ కార్డులున్నాయని పాకిస్థాన్ తెలిపింది. ఒకసారి డిపోర్ట్ చేసిన వారు తిరిగి వెనక్కి రాకుండా చూస్తామని పాకిస్థాన్ అంటోంది. రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ ఉన్నవారు జూన్ 30 వరకు ఉండొచ్చని స్పష్టం చేసింది. ఆఫ్ఘన్ కాందీశీకులను గౌరవంగా తిప్పి పంపాలని తాలిబాన్ కోరుకుంటోంది. పాకిస్థాన్‌లో ఆఫ్ఘన్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 30 ఏళ్ల ఓమైద్ ఖాన్ తనకు ఆఫ్ఘన్ సిటిజెన్ కార్డు ఉందని, కానీ తన భార్యకు రిజిస్ట్రేషన్ ప్రూఫ్ ఉందని, కానీ తమ ఇద్దరు పిల్లలకు ఎలాంటి డాక్యుమెంట్లు లేవని వాపోయాడు. పాకిస్థాన్‌లోనే పుట్టిపెరిగిన చాలా మంది ఆఫ్ఘన్లు తమ భవిష్యత్తు ఏమిటని వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News