Wednesday, December 25, 2024

బైడెన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

Pakistan PM angry over Biden's comments

ఇస్లామాబాద్ : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పాకిస్థాన్ అణ్వాయుధాల సామర్ధంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చాలా ఘాటుగా స్పందించారు. గత దశాబ్దాలుగా అణ్వాయుధాల విషయంలో పాక్ అత్యంత బాధ్యతాయుతమైన అణురాజ్యంగా నిరూపించుకుంది. తమ అణుకార్యక్రమాలను ఫుల్ ప్రూఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌తో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని స్వతంత్ర దేశాల మాదిరిగా మా అణుకార్యక్రమాల వల్ల ఏ దేశానికి ముప్పు వాటిల్లదు. మేము ప్రాంతీయ శాంతి భద్రతలను పెంపొందించడంతో యూఎస్‌కి సహకరించాలన్నదే మా కోరిక. పాకిస్థాన్ తన స్వయం ప్రతిపత్తి సార్వభౌమ రాజ్యాధికారం కాపాడుకునే హక్కును కలిగి ఉంది. అని షెహబాజ్ ట్వీట్ చేశారు.

బైడెన్‌ను నిలదీసిన ఇమ్రాన్
పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చీఫ్ , మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందిస్తూ బైడెన్ దేన్ని ఆధారం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారంటూ నిలదీశారు. ముఖ్యంగా అణ్వాయుధీకరణ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాల్లో పాల్గొన్న యూఎస్‌లా పాక్ ఎప్పుడు దూకుడుగా వ్యవహరించిందని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News