పాక్ ప్రధాని, చైనా అధ్యక్షుడి విజ్ఞప్తి
ఇస్లామాబాద్: తీవ్ర నిత్యావసర వస్తువుల కొరతను ఎదుర్కొంటున్న తాలిబన్ పాలిత అఫ్ఘానిస్తాన్‌కు తక్షణం మానవతాపరమైన, ఆర్థికపరమైన సహాయం అందచేయవలసిందిగా అంతర్జాతీయ సజామానికి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మొట్టమొదటిసారి సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. మంగళవారం పాకిస్తాన్ ప్రధాని, చైనా అధ్యక్షుడు టెలిఫోన్ ద్వారా అప్ఘాన్‌లో ప్రస్తుత పరిస్థితిని చర్చించినట్లు పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అఫ్ఘాన్‌లో పరిస్థితిని ఇద్దరు నాయకులు చర్చించారని, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించి, అక్కడి అస్థిర పరిస్థితిని నిర్మూలించి, ఆ దేశ పునర్మిర్మాణానికి తోడ్పడవలసిందిగా అంతర్జాతీయ సమాజానికి వారిద్దరూ పిలుపునిచ్చినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. ఖతర్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ జీ తాలిబన్ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.అంతేగాక బుధవారం అఫ్ఘాన్‌కు పొరుగు దేశాలైన టెహ్రాన్, ఇరాన్ విదేశాంగ మంత్రులు రెండవసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చైనా, పాకిస్తాన్ దేశాలు కూడా పాల్గొననుండడం విశేషం.