Friday, November 15, 2024

మాస్కోలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలి పర్యటన!

- Advertisement -
- Advertisement -

Pakistan PM Imran Khan's first visit to Moscow

వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలి మాస్కో పర్యటనకు ముందే అమెరికా ఆయనకు ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేయబోతున్నట్లు తెలిపిందని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ చర్యలపై ప్రతి దేశం అభ్యంతరం వ్యక్తంచేయాల్సిన బాధ్యత ఉంందని కూడా అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో మాస్కోకు పాకిస్తాన్ పిఎం ఇమ్రాన్ ఖాన్ పర్యటించారు. వాషింగ్టన్‌లో బుధవారం ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఈ వివరాలు తెలిపారు. “ఇమ్రాన్ ఖాన్ మాస్కోకు పర్యటించనున్న విషయం మాకు తెలుసు” అని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టంచేశారు. “ ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేయబోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని పాకిస్థాన్‌కు మా వైఖరిని తెలిపాము. యుద్ధానికి ప్రతిగా దౌత్య మార్గాన్ని అనుసరించాలని తెలిపాము” అని కూడా ఆయన వివరించారు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెండు రోజుల పర్యటనపై బుధవారం రష్యా చేరుకున్నారు. ఆయన తన సందర్శన సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకోనున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రష్యా తన బలగాలను మోహరించిన నేపథ్యంలో రష్యాపైన అనేక పాశ్చాత్య దేశాలు కొత్త ఆంక్షలను విధించాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌తో ఆర్థిక సహకారం విషయమై చర్చించేందుకు ఇమ్రాన్ ఖాన్ రష్యా వెళ్లారు. రాజకీయవేత్తగా మారిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ రష్యాకు తొలి పర్యటన చేస్తున్నారు. ఇదివరకటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ 1999లో రష్యా పర్యటించిన 23 ఏళ్లకు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటిస్తున్నారు. కాగా రష్యా కంపెనీలతో కలిసి పాకిస్థాన్ మల్టీ బిలియన్ డాలర్ల గ్యాస్ పైప్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించనున్నారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News