బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ అయ్యాక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం బలూచిస్తాన్ ప్రాంతాన్ని సందర్శించారు. బలూచిస్తాన్‌లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. హైజాక్ అయిన రైలులో నలుగురు సైనికులు, 21 మంది పౌరులు చంపేయబడ్డారు. పాక్ సైనిక బలగాలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఏ)కి చెందిన 33 మంది మిలిటెంట్లను చంపేశాక షరీఫ్ ఈ పర్యటన చేశారు. ఆయన వెంట ఉపప్రధాని ముహమ్మద్ ఇషాఖ్ దర్, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అత్తవుల్లా తరార్, ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రి అహసాన్ ఇఖ్బాల్, శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి నవాబ్‌జాదా మీర్ ఖాలీద్ మగ్సీ తదితరులు ఉన్నారు. 440 మంది ప్రయాణికలతో క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న రైలుపై బిఎల్‌ఏ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి గుడలర్, పిరు కున్రీ సొరంగం వద్ద హైజాక్ చేశారు. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్, స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, ఆర్మీ, ఫ్రాంటియర్ కోర్‌కు చెందిన యూనిట్లు రెస్కూ ఆపరేషన్ చేపట్టాయి. ‘సెక్యూరిటీ బలగాలు తిరుగుబాటుదారులను ఏరివేసాయి’ అని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు.
బలూచిస్తాన్‌లో పర్యటించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -