Sunday, January 19, 2025

వర్షంలో మహిళ గొడుగు లాక్కున్న పాక్ ప్రధాని(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం అన్న నినాదం భారతీయులలో అత్యధిక శాతం మంది పాటిస్తారు. కాని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి మాత్రం ఈ నినాదం ఏమాత్రం వర్తించదని తేలిపోయింది. ఇటీవల ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆయన ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమర్యాదస్తుడు, ఆయన ప్రవర్తన యావద్దేశానికే అవమానకరంగా ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రధానిపై ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం వెనుక కారణం ఏమిటంటే…

ఇటీవల పారిస్‌లో జరిగిన రెండు రోజుల న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనే నిమిత్తం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ పారిస్ చేరుకున్నారు. సమావేశం వేదిక అయిన పాలెస్ ్రబ్రోగ్నిఆర్ట్‌కు ఆయన చేరుకున్న సమయంలో ఆయన కోసం వర్షంలో గొడుగు పట్టుకుని ఒక మహిళా ప్రొటోకాల్ అధికారి వేచి చూస్తున్నారు. కారు దిగిన షరీఫ్ నేరుగా ఆమె వద్దకు వెళ్లారు. ఆమెతో ఏం చెప్పారో కాని ఆమె చేతిలోని గొడుగు లాక్కుని వర్షంలో తడవకుండా షరీఫ్ నడుచుకుంటూ వెళ్లిపోయారు.

అయితే ఆ అప్పటిదాకా గొడుగు నీడన ఉన్న ఆ మహిల వర్షంలో తడుస్తూనే షరీఫ్‌ను అనుసరించారు. వర్షంలో తడుస్తున్నా మహిళ వైపు కన్నెత్తి కూడా షరీఫ్ చూడకపోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేమి మర్యాద షరీఫ్ అంటూ నిలదీస్తున్నారు. మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News