Wednesday, April 2, 2025

పాకిస్తాన్ ప్రగతిశీల కవయిత్రి ఫమిదా రియాజ్

- Advertisement -
- Advertisement -

ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో నియంత్రృత్వానికి నియంతలకు పేరెన్నిక గన్న దేశం పాకిస్తాన్. అయితేనేం అక్కడ నియంతలకు, వారి నియంతృత్వానికి అంతే స్థాయిలో అక్కడి కవుల నుంచి కవయిత్రుల నుంచి నిరసన, అసమ్మతి వ్యక్తమవుతూనే ఉన్నది. ఆదేశ పాలకుల అణచివేత విధానాలపై, అప్రజాస్వామిక విధానాలపై తన జీవితాంతం పోరాటం చేస్తూ అంతేస్థాయిలో కవిత రచన చేసి అక్కడి నియంతల కోపానికి గురై దశాబ్దాల పాటు జైలు జీవితం గడిపిన ప్రజాకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ గురించి ప్రపంచ మంతా తెలిసిన విషయమే. భారతదేశ వ్యాప్తంగా -ఉర్దూ, హిందీ సాహితీ ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన ఫైజ్ వలే పాక్ నియంతల అణచివేతపై ఎడతెగని పోరాటం చేస్తూ నియంతృత్వానికి ఏమాత్రం తలొగ్గకుండా నిరసన పతాకగా నిలిచిన మరొకవి ఉన్నారు. ఆమె ఒక మహిళ. పేరు ఫమిదా రియాజ్.

తను విప్లవ కవయిత్రియే గాక స్త్రీవాది కూడా. స్త్రీవాదిగా పాకిస్తాన్ మహిళా సమాజంలో ఎంతో ప్రభావశీలమైన పాత్ర నిర్వహించిన ధీరోదాత్త మహిళ రియాజ్. అవిభజిత భారత -ఉపఖండాన 1946లో పుట్టి విభజన అనంతరం పాకిస్తాన్‌కు తరలిపోయిన కుటుంబానికి చెందిన వ్యక్తి ఫమిదా రియాజ్ తన తొలియవ్వన కాలం నుంచే వామపక్ష భావజాలం తో ప్రభావితమై తిరుగుబాటు భావాలను పుణికి పుచ్చుకున్న ఫమిదా కళాశాల తరగతులను ఎగ్గొట్టి, నిషేధిత కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిగా చేరింది. అందులో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నది. కరపత్రాలు పంచేది. పోస్టర్లు అంటించేది.

అక్కడి ఛాందస పోకడలపై కవితా రచనలు చేసేది. ఆమె కార్యాకలాపాలను చూసి విసిగెత్తిపోయిన తల్లిదండ్రులు చిన్ననాడే పెళ్లి చేసారు. దీంతో లండన్ వెళ్లవలిసి వచ్చింది. కొన్నాళ్లు అక్కడే -ఉండి వివాహ జీవితానికి స్వస్తి పలికి 1973లో తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చింది. జుల్ఫీకర్ అలీ భుట్టో ప్రజాస్వామిక పాలన కొనసాగుతున్న కాలమది. ఈ పరిస్థితులలో ఆమె ‘ఆవాజ్’ పేరుతో ఒక పత్రికను స్థాపించింది. దీంతో ఫ్యూడల్ సాంప్రదాయవాదులైన ఆ దేశ రాజకీయ వాదులతో పోరాటానికి దిగింది. ఇదే కాలాన తన కళాశాల జీవితం నుంచి కవితా రచనలో మునిగి తేలిన ఫమిదా “ఛిద్రమైన దేహం” పేరుతో స్త్రీల లైంగికత కేంద్రంగా సంచలనాత్మక కవితా సంకలనాన్ని వెలువరించింది.

చిన్న వయస్సులోనే ఆమె చేసిన సాహసాన్ని, నిస్సంకోచమైన వ్యక్తీకరణలు, భావాలను చూసి సాంప్రదాయవాదులతో కూడకున్న ఉ-ర్దూ సాహితీ ప్రపంచం నిశ్చేష్టులయ్యింది. ఉ-ర్దూ సాహిత్యరంగంలో ఎంతో బలమైన గజల్ కవితా రూపాన్ని తిరస్కరించి కవితకు వచనకవితా రూపాన్ని ఎంచుకుని ఆనాటి -ఉర్దూ సాహితీ ప్రపంచంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నది. “అదూరే ఆద్మి”, “దూప్‌”, “మీరు సంపూర్ణ చంద్రున్ని చూడలేరా?” వంటి కవితా సంపుటాలను ప్రచురించి తమ దేశ పరిస్థితులపై నిరసన వ్యక్తం చేసింది. తన పత్రికలో అక్కడి సామాజిక దురంతాలపై నిరసన వ్యక్తం చేస్తూ వచ్చిన కవిత్వానికి ప్రాధాన్యతనిచ్చింది. భారతదేశం, బంగ్లాదేశ్ నుంచి వచ్చే కవిత్వాన్ని అనువదించి వాటిని పాక్ పాఠకులకు పరిచయం చేసింది.
ఈ క్రమంలో 1978లలో భుట్టోను పదవి విచ్యుతుణ్ని చేసి సైనికాధికారి జియాఉల్ హక్ అధికారం చేపట్టాడు. పైగా భుట్టోను జైలుపాలు చేసి ఉ-రితీశాడు. దీన్ని వ్యతిరేకిస్తూ జియాఉల్ హక్ విధానాలను ఖండిస్తూ ఫమిదా తన పత్రిక ఆవాజ్‌లో కవితా రచనలు వార్తలు, వ్యాసాలు ప్రకటిస్తూ వచ్చింది.

దీంతో ఆవాజ్ పత్రిక సెన్సార్‌కు గురైంది. పోలీసుల దాడులు ఎదుర్కోవల్సి వచ్చింది. పదేపదే దాడులు జరగడంతో తన కవితా రచనలు మానేసి ఆఫ్రికా, అరబ్ దేశాల విప్లవ కవితా రచనల అనువాదాలను ప్రచురించడం మొదలు పెట్టింది. కాగా 1980లలో ఆవాజ్ పత్రిక నిషేధానికి గురయ్యింది. పైగా అనేక కేసులు ఎదుర్కోవలిసి వచ్చింది. వాటిలో దేశద్రోహం, -ఉరిశిక్ష విధించే కేసులు కూడా ఉన్నాయి. ఇదే కాలాన ప్రగతిశీలవాదులైన అనేకమంది మహిళలు, రచయితల అరెస్టు లు మొదలయ్యాయి. నియంత జియాఉల్ హక్ బారి నంచి తప్పించుకోవడానికి ఆ దేశ “విప్లవకవి ఫైజ్ అహ్మద్‌” ఫైజ్ లెబనాన్ దేశాన్ని ఆశ్రయం కోరి అక్కడికి రహస్యంగా వెళ్లిపోయాడు. మరో కవి అహ్మద్ ఫరాజ్ కెనడాను ఆశ్రయించాడు.

ఎంతో ప్రసిద్ధులైన ఆ దేశ కవులు, దేశం విడిచిపోతుండడంతో తనకు రానున్న ప్రమాదం గమనించిన ఫమిదాకు పాకిస్తాన్‌ను విడిచి మరో దేశానికి వెళ్లే పరిస్థితి ఏదీ కనిపించకుండా పోయింది. ఆయా దేశాలలోని వామపక్ష కవులు, రచయితలు పురుష కవులకు అండగా నిలిచిన పరిస్థితులవి. ఆమె మహిళ కావడం కూడా మరో దేశంలో ఆశ్రయం కోరడం అడ్డంకిగా మారింది. అయితే అంతకు మునుపే ఢిల్లీ నుంచి ఒక కవి సమ్మేళనంలో పాల్గొనమని ఆమెకు ఆహ్వానం అంది- ఉన్నది. అది ఆశారేఖగా ఆమెకు కనిపించింది. నమ్మకస్తులైన దోస్తుకు చెప్పి 1992లో తన ఇద్దరు పిల్లలను, చెల్లెను తీసుకుని రహస్యంగా ఢిల్లీకి బయలుదేరే విమానం ఎక్కి భారత్‌కు చేరుకున్నది. ఇక్కడికి వచ్చే ముందు తాను వెలువరించిన కవితలను రహస్యంగా తనతో పాటు తీసుకొచ్చి వాటిని “పాకిస్తాన్ 81” హిందీలో ప్రచురించింది.

ప్రఖ్యాత రచయిత అమృతా ప్రీతం ఆమెకు ఢిల్లీలో ఆశ్రయం కలిపించింది. ప్రీతమే ఫమిదాకు రాజకీయ ఆశ్రయం కలిపించేందుకు ఆ నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. చివరికి నెల రోజుల తర్వాత రాజకీయ శరణార్థిగా ఫమిదాకు ఆశ్రయం దొరికింది. దీంతో పాటు ఆమెకి జెఎన్‌యు, జామీయా, మిలియా వంటి విశ్వవిద్యాలయాలలో ఆమెకు ఉ-పాధి దొరికింది. దీనికి నెలరోజులు పట్టింది. ఈ లోపు ఆమె భర్త వామపక్ష ఉద్యమ కార్యకర్త ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వచ్చి రియాజ్‌ను కలుసుకున్నాడు. ప్రవాస జీవితం కూడా సాఫీగా సాగలేదు. ఆమె -ఉత్తరాలు సెన్సార్‌కు గురయ్యేవి. నిరంతరం ఆమెపై ఏదో మేరకు నిఘా కొనసాగేది. అయితే ఆమె ఏ మాత్రం స్థయిర్యం కోల్పోలేదు.

మన దేశ ఉ-ర్దూ ప్రగతిశీల రయితలు, కవులు కైఫీ ఆజ్మీ సర్దార్ జాఫ్రీ, ఇస్మత్ చుగ్తాయి, వంటి వారు ఆమెకు అండగా నిలవడంతో ఆమె ఢిల్లీలో జరిగే కవితా సమ్మేళనాలలో పాల్గొనేది. ఒక సమ్మేళనంలో ఆనాటి బీజెపీ నాయకుడు వాజ్‌పేయితో కలిసి కవి సమ్మేళనంలో పాల్గొన్నది. 1985లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలాన మన దేశానికి పర్యటన నిమిత్తం వచ్చిన పాక్ నియంత జియాఉల్ హక్‌కు నిరసనగా ఢిల్లీలో స్థానిక కవులతో కలిసి కవి సమ్మేళం నిర్వహించింది. బతుకు దెరువుకు కొన్నాళ్లు ఒక ఎన్‌జీవో పక్షాన మహారాష్ర్టలోని ఆదివాసీ ప్రాంతాలలో పనిచేసి అక్కడి జీవితాన్ని “గోదావరి” పేరుతో నవల రాసింది. భారతదేశాన ప్రవాసంలో -నాశీ ఆమె గతం ఆమెను వెంటాడుతూనే -ఉండేది. 1988లో నియంత జియాఉల్ హక్ మరణించడం వల్ల జరిగిన ఎన్నికలలో బెనజీర్ భుట్టో అధికారంలోకి వచ్చారు. దీంతో ఫమిదా రియాజ్ తిరిగి తన స్వదేశమైన పాకిస్తాన్‌కు వెళ్లి పోయారు.

ప్రవాస కాలాన ఆమె రాసిన కవితల పుస్తక రూపేణా ప్రచురించే శక్తి ఉన్నా.. ఆ కవితలను తన స్వదేశంలోనే ప్రచురించాలని భావించి పాకిస్తాన్‌కు రహస్యంగా పంపి ప్రచురించింది. ఆ కవితలన్నీ జియా పాలన తూర్పార పట్టినవే.. ఇందులో “దుప్పటి నాలుగు గోడలు” అన్న కవితా సంకలనం జియాఉల్ హక్ నియంతృత్వ పాలనలో ఆ దేశ మహిళల పోరాటపటిమ, ప్రతిఘటనను అక్ష ర బద్దం చేసినటువంటి సంకలనం.. జీవితాంతం, మహిళలు, పిల్లలు, ఇతర అణగారిన వర్గాల పక్షం వహించి కవితా రచనలకు పూనుకుని వారి పక్షం వహించి ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడిన ఈ ధీరోదాత్త మహిళ 2018 నవంబర్ 21న కాలం చేశారు. ఆమెకు నా నివాళి.

సామిడి జగన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News