Friday, November 22, 2024

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు..

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ రద్దు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ సలహా మేరకు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58(1) ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని, అలాగే పార్లమెంటు దిగువ సభను కూడా రద్దు చేయాలని ప్రధాని షెహబాజ్, అధ్యక్షుడికి లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి పాక్ అధ్యక్షుడు.. జాతీయ అసెంబ్లీని, పార్లమెంటు దిగువ సభను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఐదేళ్ల పాలనాకాలం పూర్తి కావడానికి మూడు రోజుల ముందే ముస్లీం లీగ్-నవాజ్ కూటమి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రద్దైంది. కాగా, పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం, అసెంబ్లీ నిర్ణీత సమయానికి ముందే రద్దు చేయబడితే, సాధారణ ఎన్నికలు 90 రోజుల్లో నిర్వహించబడతాయి. నిర్దేశిత వ్యవధిని పూర్తి చేస్తే 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News