కరోనా కోరల్లో పాక్ అగ్రనేతలు
కరోనా కాటుతో 14,356 కు పెరిగిన మరణాల సంఖ్య
ఏప్రిల్ 5 నుంచి నిబంధనలు కఠినంగా అమలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మూడో వేవ్ ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వం సామాజిక నిబంధనలను మరింత కఠినం చేసింది. సభలు, సమావేశాలు, పెళ్లిళ్లుపై ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 5 నుంచి ఈ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తుంది. మంగళవారం ఒకే ఒక్క రోజులో కొత్త కరోనా కేసులు 4084 వరకు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,63, 299కు చేరింది. కొత్తగా వందమంది కన్నా ఎక్కువ మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 14.356 కు పెరిగింది. ఈ నేపథ్యంలో పాక్ అధ్యక్షుడు డాక్టర్ అరీఫ్ అల్వి, రక్షణ మంత్రి పెర్వెజ్ ఖట్టక్‌లకు కరోనా సోకింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అతని భార్యకు కరోనా పాజిటివ్ కనిపించిన తరువాత మిగతా అగ్రనేతలకు కూడా కరోనా వ్యాపించింది.
తాను వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నానని, వారం రోజుల్లో రెండవ డోసు తీసుకున్న తరువాతనే యాంటీబాడీలు పెరగడం ప్రారంభమౌతుందని, అందువల్ల జాగ్రత్తలు పాటించవలసి ఉందని పాక్ అధ్యక్షుడు అల్వీ ట్వీట్ చేశారు. అలాగే అధ్యక్షుని భార్య సమీనా అల్వీకి పరీక్షలో కరోనా నెగిటివ్ వచ్చినా ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. రక్షణ మంత్రి పెర్వెజ్ ఖట్టక్‌కు కరోనా పాజిటివ్ కనిపించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆయన భార్య బుష్రా బీబీకి మార్చి 20న కరోనా పాజిటివ్ కనిపించింది. ప్రస్తుతం వారిద్దరూ స్వయం ఐసొలేషన్‌లో ఉంటున్నారు. ఈలోగా మాజీ ఆర్థిక మంత్రి హఫీజ్ షేఖ్‌కు మంగళవారం కరోనా పాజిటివ్ సోకింది. సోమవారం కేబినెట్ నుంచి ఆయనను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దూరం చేశారు. . ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, లతో సహా మొత్తం 26 నగరాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు.
Pakistan President test positive for Covid 19