Friday, December 20, 2024

ఆ విధంగా గెలిస్తే పాక్ సెమీస్‌కు?..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో సెమీస్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్ జట్టు హోరాహోరీగా పోరాటం చేయాల్సి ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై గెలిచి సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారైంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరాయి. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ 287 పరుగుల తేడాతో గెలిస్తే సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి. పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 350 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ 63 పరుగులకే ఆలౌట్ చేయాలి. పాక్ 400 పరుగులు చేస్తే 113 పరుగుల లోపు ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేయాలి. ఇప్పటి వరకు ఏ జట్టును కూడా 400 పరుగులకు పైగా ఇంగ్లాండ్ జట్టు చేయానివ్వలేదు. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే పాక్ మాత్రం మూడు ఓవర్లలో లక్ష్యాన్ని చేధించాలి. ఎలా చూసినా పాక్ మాత్రం సెమీస్ చేరే అవకాశాలు కనిపించడం లేదు. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే పాక్ పనైపోయినట్టే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News