ఇష్టంలేకపోతే వర్చువల్‌గా హాజరుకండి: భారత్‌కు పాక్ విదేశాంగమంత్రి ఖురేషీ సూచన
ఇస్లామాబాద్: 19వ సార్క్ సదస్సును నిర్వహించేందుకు తమ దేశం సిద్ధంగా ఉన్నదని పాకిస్థాన్ విదేశాంగమంత్రి షామహ్మద్‌ఖురేషీ తెలిపారు. ఇస్లామాబాద్‌కు రావడానికి ఆసక్తి లేకపోతే సదస్సుకు భారత్ వర్చువల్‌గా హాజరు కావచ్చునని ఖురేషీ సూచించారు. సార్క్‌లోని ఇతర దేశాలను సదస్సుకు రాకుండా అడ్డుకోవద్దని కూడా ఖురేషీ సూచించారు. సదస్సుకు హాజరు కాబోమని భారత్ మొండివైఖరి ప్రదర్శించడం ద్వారా సార్క్ విధి నిర్వహణకు ఆటంకాలు సృష్టిస్తోందని ఖురేషీ ఆరోపించారు. దక్షిణాసియా దేశాల మధ్య సహకారం కోసం ఏర్పాటైన సార్క్‌లో భారత్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక సభ్య దేశాలు. సార్క్ చివరి సమావేశం 2014లో కాఠ్మండ్‌లో జరిగింది.
2016 నవంబర్ 1519 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సదస్సు రద్దయింది. అదే ఏడాది సెప్టెంబర్ 18న జమ్మూకాశ్మీర్‌లోని భారత సైన్యానికి చెందిన ఉరీక్యాంప్‌పై ఉగ్రదాడి జరగడంతో సదస్సుకు హాజరు కాబోమని భారత్ స్పష్టం చేసింది. దాంతో, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్థానిస్థాన్ కూడా భారత్‌కు మద్దతుగా సదస్సుకు హాజరు కాలేమని తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలోనే ఖురేషీ భారత్‌పై విమర్శల దాడికి దిగారు. కాశ్మీర్ అంశం పరిష్కారం అయితేనే భారత్‌తో శాంతియుత సంబంధాలు సాధ్యమని ఖురేషీ పాతపాటే పాడుతున్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకుండా, హింసను ప్రోత్సహించకుండా పాక్ ఉన్నపుడే ఓ పొరుగుదేశంగా సాధారణ సంబంధాలు నెలకొంటాయని భారత్ అందుకు గట్టిగా బదులిచ్చింది.