- Advertisement -
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఓ కరడుగట్టిన ఇస్లామిక్ తీవ్రవాద నేత సాద్ హుస్సేన్ రిజ్విని అధికారులు జైలు నుంచి విడుదల చేశారు. రిజ్వి పాకిస్థాన్‌లోని సున్ని మిలిటెంట్ గ్రూప్ తెహరీక్ ఎ లాబయిక్ పాకిస్థాన్ (టిఎల్‌పి) అధినేతగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఉగ్రవాది అనే అభియోగాలతో అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే అప్పటి నుంచి ఆయన అనుచరులు హింసాత్మక నిరసనలకు దిగారు. దీనితో అల్లర్లు జరగకుండా ఉంటే విడిచిపెడుతామని పేర్కొంటూ ఆ నేత పేరును ఉగ్రవాదుల నిఘా జాబితా నుంచి తొలిగించి ఇప్పుడు లాహోర్‌లోని ఓ జైలు నుంచి విముక్తి కల్పించారు. ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ఆయన అనుచరుల షరతుకు అంగీకరించి ఈ చర్యకు పాల్పడిన విషయాన్ని అధికారులు నిర్థారించారు. రిజ్వి తరఫు న్యాయవాది కూడా దీనిని ధృవీకరించారు.
- Advertisement -