Saturday, December 21, 2024

లోయలో పడిన బస్సు-కారు: 30 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోహిస్తాన్ జిల్లాలో బస్సు – కారు ఢీకొని లోయలో పడిపోవడంతో 30 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు గిలిగిత్ నుంచి రావల్‌పిండికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షితైల్ నుంచి కారు ఎదురుగా వస్తున్న ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. రెస్యూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గిల్‌గిత్ బల్టిస్థాన్ ముఖ్యమంత్రి ఖలీద్ ఖుర్షీద్ ఈ ఘటన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జనవరి 2న బలోచిస్తాన్‌లో బస్సు లోయలో పడిపోవడంతో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. రోడ్లు అస్తవస్తంగా ఉండడంతో పాటు డ్రైవర్ల తప్పిదంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు వేగాన్ని తన అదుపులో ఉంచుకోకపోవడంతోనే ఈప్రమాదాలు జరుగుతున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News