Monday, December 23, 2024

ఆర్థిక సంక్షోభం.. అమెరికాలోని ఎంబస్సీని అమ్మకానికి పెట్టిన పాక్..

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కెందుకు దైనందిన కార్యకలాపాల నిర్వహణలకు వీలు కల్పించుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నానా మార్గాలు ఎంచుకొంటోంది. ఇందులో భాగంగా ఇప్పుడు పాకిస్థాన్ అమెరికాలోని తమ ఎంబస్సీ ఆస్తులను అమ్మేసుకుంది. 2000 ప్రాంతంలో వాషింగ్టన్‌లో పాక్ రాయబార కార్యాలయం విలాసవంతంగా నిర్మించారు. ఇండియా ఎంబస్సీకి అతి దగ్గరిలోనే మసాఛూసెట్స్ అవెన్యూలో ఇంతకు ముందటి ఎంబస్సీ ఉంది. దీని తరువాత కొత్త భవనం వెలిసింది. అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ సాయం పొందేందుకు పాకిస్థాన్ పలు విధాలుగా యత్నిస్తూ ఉన్నా, ఉగ్రవాద ముద్రలతో అడ్డంకులు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలో పలు దేశాలలోని తమ దేశ ఆస్తులను విక్రయించేందుకు ఇప్పుడు షెహబాజ్ ప్రభుత్వం యత్నిస్తోంది. ఇప్పటికే గ్రీసు తమ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు తమ దీవులను విక్రయించింది. పాకిస్థాన్‌కు దీవులు లేకపోవడంతో ఇప్పుడు దౌత్యకార్యాలయాలను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పుడు వాషింగ్టన్‌లోని ఆర్ స్ట్రీట్ ఎన్‌డబ్లులో ఉన్న బిల్డింగ్ సంబంధిత ఆస్తులను విక్రయించిందని వెల్లడైంది. అయితే పాత భవనం అమ్మకానికి పెట్టారా? లేక కొత్తదా అనేది పాకిస్థాన్ ఆన్‌లైన్‌లో స్పష్టం చేయలేదు.

Pakistan selling embassy property in US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News