Monday, December 23, 2024

టీ20 ప్రపంచకప్: భారత్ టార్గెట్ 160 పరుగులు

- Advertisement -
- Advertisement -

Pakistan set 160 runs target for India

మెల్బోర్న్: మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, పాకిస్తాన్ టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాక్ భారత్‌కు 160-పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముచ్చట తెలిసిందే. భారత్ విజయలక్ష్యానికి 160 పరుగులు చేయాల్సిఉంది. పాక్ బ్యాటింగ్ లో షాన్ మసూద్ 52 నాటౌట్, ఇఫ్తికర్ 51, షాహిన్ షా 16 పరుగులు చేశారు. షాన్‌ మసూద్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌లు పాక్‌ తరుపున కీలకంగా ఆడారు. బౌలింగ్ విషయానికోస్తే హార్దిక్ పాండ్యా, అర్షదీప్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. భువనేశ్వర్, షమీ చెరో వికెట్ పడగోట్టారు.

జట్లు

పాకిస్థాన్: 1 మహ్మద్ రిజ్వాన్, 2 బాబర్ ఆజం, 3 షాన్ మసూద్, 4 షాదాబ్ ఖాన్, 5 హైదర్ అలీ, 6 ఇఫ్తికర్ అహ్మద్, 7 మహ్మద్ నవాజ్, 8 ఆసిఫ్ అలీ, 9 షాహీన్ షా ఆఫ్రిది, 10 నసీమ్ షా, 11 హరీస్ రవూఫ్.

భారత్: 1 రోహిత్ శర్మ, 2 కేఎల్ రాహుల్, 3 విరాట్ కోహ్లీ, 4 సూర్యకుమార్ యాదవ్, 5 హార్దిక్ పాండ్యా, 6 దినేష్ కార్తీక్, 7 అక్షర్ పటేల్, 8 ఆర్ అశ్విన్, 9 మహమ్మద్ షమీ, 10 భువనేశ్వర్ కుమార్, 11 అర్ష్‌దీప్ సింగ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News